శశికళను ఎదుర్కొనేందుకు సిద్ధం

KC Veeramani Said We Are Ready To Face Sasikala Out - Sakshi

సాక్షి, చెన్నై: బెంగళూరు జైలు నుంచి శశికళ బయటకు వచ్చి సమస్యలు సృష్టించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మంత్రి కేసీ వీరమణి తెలిపారు. వేలూరు కలెక్టరేట్‌లో శనివారం మంత్రి గ్రామీణ ప్రాంతాలకు రేషన్‌ వస్తువుల పంపిణీ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ బైకులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్‌ కార్డుదారులకు ఇంటి వద్దకే వస్తువులు అందజేసేందుకు వాహన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు.  (నా సమాచారం ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ)

షోళింగర్‌లో ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రారంభించనున్నామని తెలిపారు. శశికళ బయటకు వస్తారని ఏదో అయిపోతుందని కొన్ని పత్రికలు ఇష్టానుసారంగా రాస్తున్నారని వీటిని వదిలి పెట్టి ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాలపై వార్తలు రాయాలన్నారు. డీఆర్‌ఓ పారి్థబన్, అన్నాడీఎంకే కార్పొ రేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు, ఆవిన్‌ డెయిరీ చైర్మన్‌ వేలయగన్, అధికారులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top