రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్‌ 

Kamal Haasan Invites Rajinikanth To Join With Him In Politics - Sakshi

రజనీకి కమల్‌హాసన్‌ పిలుపు  

సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్‌కు మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌హాసన్‌ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కమల్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్‌ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్‌ పిలుపునివ్వడం గమనార్హం.   

చదవండి:
అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top