కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ | Kadapa Court Shock For Sharmila And Sunita | Sakshi
Sakshi News home page

కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ

May 8 2024 6:12 PM | Updated on May 8 2024 7:36 PM

Kadapa Court Shock For Sharmila And Sunita

పీసీసీ చీఫ్‌ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పీసీసీ చీఫ్‌ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement