నాకు పీకే చెప్పారు.. టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్‌ | Sakshi
Sakshi News home page

నాకు పీకే చెప్పారు.. టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు: కేఏ పాల్‌

Published Sun, Apr 24 2022 8:52 AM

KA Paul Comments On TRS Winning Seats Next Assembly Elections - Sakshi

సనత్‌నగర్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తనకు చెప్పినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారానికి దూరమవుతుందనే కేసీఆర్‌ చెంత నుంచి ‘పీకే’జారుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్‌ మాట్లాడుతూ 2008లో కేసీఆర్‌ తనను కలిసి తెలంగాణకు మద్దతు కోరగా ఇచ్చానని చెప్పారు.
చదవండి👉🏾 వరంగల్‌ నుంచే కేసీఆర్‌ చీడ వదిలిద్దాం

కానీ టీఆర్‌ఎస్‌ 8 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్‌ రాష్ట్రం కాస్తా ప్రస్తుతం రూ. 4.12 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని పాల్‌ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  కుల, మత, కుట్ర రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి మార్పు తీసుకొద్దామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని.. చారిటీ నుంచి రూ. 7,500 కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేస్తాన్నారు.  
చదవండి👉🏻 ‘బీజేపీ బుల్డోజర్‌’ అంటే కేటీఆర్‌కు భయం: జీవీఎల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement