తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదు: జోగి రమేష్‌

Jogi Ramesh Slams On Chandrababu And Yellow Media Over Ayyana Parthudu Attack - Sakshi

సాక్షి, తాడేపల్లి: సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా అయ్యన్న పాత్రుడికి వత్తాసు పలుకుతోందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై దాడి చేస్తారా? అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు. తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదని ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు.  

చదవండి: జోగి రమేష్‌పై టీడీపీ దాడి 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పాలనను చూసిన టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, మహిళలపై అయ్యన్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. గూండాలు, రౌడీ మూకలను పంపించి చంద్రబాబు తనపై దాడి చేయించారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు.
  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top