తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి | Jagruti Activists Attack Teenmar Mallanna Office | Sakshi
Sakshi News home page

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

Jul 13 2025 12:19 PM | Updated on Jul 13 2025 2:26 PM

Jagruti Activists Attack Teenmar Mallanna Office

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.

మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్‌ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.
 

మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement