టీడీపీలో ‘గోరంట్ల’ కలకలం: చంద్రబాబును కలవనని ప్రకటన

I Will Not Meet To Chandra Babu Said Gorantla Butchaiah Chowdary - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపింది. పార్టీలోని అంతర్గత వర్గ విభేదాలు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు గురువారం గుప్పుమన్నాయి. పార్టీలో సీనియర్‌ అయిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును కలవను. నేను ఒంటరివాడిని. చంద్రబాబును నా వద్దకు వచ్చిన నాయకులు వెళ్లి కలుస్తారు. పార్టీ మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మీకే చెబుతా. పార్టీ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యం’ అని తెలిపారు. ఇటీవల తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. 

చదవండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top