Kamal Haasan On Hijab Row: హిజాబ్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ కీలక వ్యాఖ్యలు

Hijab Row: Whats Happening in Karnataka shouldnot Be Allowed in Tamil Nadu - Sakshi

సాక్షి, బెంగళూరు: హిజాబ్‌ వివాదం కర్ణాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. జనవరి 1న ఉడిపిలో ముస్లిం విద్యార్థులు హిజాబ్‌ ధరించి కలేజీకి రావడంతో మొదలైన ఈ గొడవ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలోనూ ‘హిజాబ్​’పైనా చర్చ మొదలైంది. మతసామరస్యం పాటించాలని చెబుతూనే శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, ఒకే తరహా యూనిఫామ్​లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఓవైపు కర్ణాటక హైకోర్టు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్పా.. చల్లారడం లేదు. 

తాజాగా హిజాబ్‌, కాషాయ కండువాల రగడపై నటుడు కమల్ హాసన్‌ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు కమల్‌ హాసన్‌ ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. చదువుకునే అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర కర్ణాటకలో రగులుతున్న వివాదం తమిళనాడు వరకూ రాకూడదు. అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిదంటూ ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.
చదవండి: ఉత్తరాఖండ్‌ అభివృద్ధే కాంగ్రెస్‌కు నచ్చదు: మోదీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top