నారా లోకేష్‌కు ఎమ్మెల్యే గొల్ల బాబురావు సవాల్

సాక్షి, విశాఖ : దళితుల విషయంలో రాజకీయం చేయొద్దని మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు. దళితుల అభివృద్ధి గురించి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌కు.. సబ్బంహరి, వానపల్లి రవికుమార్ కుటుంబాలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దళితులకు జరిగిన అవమానాలను.. ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని అన్నారు.