
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో జనసేన ప్రచారానికే పరిమితమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో జనసేన మద్దతు విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. పవన్ కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రచారానికి సహకరించేందుకు పవన్ అంగీకరించారని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీతోనే మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.