అసలు ఏపీలో పోలీసులున్నారా..?: రోజా | Former Minister Roja Comments On Minor Girl Kidnap In Ap | Sakshi
Sakshi News home page

అసలు ఏపీలో పోలీసులున్నారా..?: ఆర్కే రోజా

Oct 6 2024 9:40 AM | Updated on Oct 6 2024 11:06 AM

Former Minister Roja Comments On Minor Girl Kidnap In Ap

సాక్షి,తిరుపతి:సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్,హత్య కు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.ఈ విషయమై రోజా ఆదివారం(అక్టోబర్‌6)మీడియాతో మాట్లాడారు.‘చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కుపోతోంది.ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల్ని స్కూళ్లకు పంపించాలంటేనే ఆడపిల్లలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది.బాలిక 29వ తేది కిడ్నాప్ అయితే 4రోజుల పాటు 4కిలోమీటర్ల దూరంలో పుంగనూరులో ఉన్నా పోలీసులు పట్టుకోలేకపోయారు.చంద్రబాబు,హోం మంత్రి,డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు.

ప్రజల్ని పట్టించుకోరు.మహిళల్ని పట్టించుకోరు. చిన్నారులను పట్టించుకోరు.అసలు ఈ ప్రభుత్వం ఉందా..పోలీసులు ఉన్నారా..ఉంటే ఏం చేస్తున్నారు.ఈ రాష్ట్రంలో పోలీసులను కేవలం కక్ష సాధింపు చర్యలకు,రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే వినియోగిస్తున్నారు.రాష్ట్రంలో మహిళలు,పిల్లల్ని పట్టించుకోరా’అని రోజా ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: అంజుమ్‌ కేసులో పోలీసుల వైఫల్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement