మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 28 2023 6:39 PM

Ex Minister Anil Kumar Yadav Sensational Comments - Sakshi

సాక్షి, నెల్లూరు: సీఎం జగన్‌ టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారే.. ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.

‘‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్‌ వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశాడో లేదో అతని అంతరాత్మకు తెలుసు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటా. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను. ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. రాజకీయాల్లో లేకుండా పోవడమే కాదు. నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతా. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి’’ అంటూ అనిల్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా?

Advertisement
Advertisement