అన్న క్యాంటీన్లపై కూటమి సర్కార్‌ కొత్త డ్రామా: అంబటి రాంబాబు | Ex Minister Ambati Rambabu Serious Comments On AP Govt Over Anna Canteens, More Details Inside | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్లపై కూటమి సర్కార్‌ కొత్త డ్రామా: అంబటి రాంబాబు

Aug 14 2024 4:49 PM | Updated on Aug 14 2024 6:05 PM

Ex Minister Ambati Rambabu Serious Comments On AP Govt

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్న క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్‌ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అన్న క్యాంటీన్లకు పచ్చ రంగు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే, సూపర్‌ సిక్స్‌ హామీలను సూపర్‌ చీట్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు.

కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌ అన్న క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామా చేస్తున్నారు. రెండు, మూడు వందల మందికి పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఊరికి దూరంగా అన్న క్యాంటీన్లను నిర్మించారు. జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనం?. క్యాంటీన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. రూ.31 కోట్లను అప్పనంగా కొట్టేశారు.  ప్రభుత్వ సొమ్ముతో అన్న క్యాంటీన్లను నిర్మించి వాటికి పార్టీ ఆఫీసుల్లాగా పచ్చరంగు వేశారు. వైఎస్సార్‌సీపీ రంగులు వేస్తోంది అంటూ గతంలో మాపై కోర్టుకు వెళ్లారు. మరి ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారు?. పేదల పథకాలను ఎత్తివేసి వారిని మరింత పేదలుగా మార్చవద్దు. పేదల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో చేశారు. పప్పుబెల్లాలు పెట్టి సంక్షేమ పథకాలు ఎత్తివేయటం కరెక్ట్‌ కాదు.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయమైంది. చంద్రబాబు నైతికతతో పోటీ పెట్టలేదని టీడీపీ నేతలు డబ్బాలు కొడుతున్నారు. అనైతికతకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. అలాంటి వ్యక్తి నుండి మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాపాడుకున్నాం. బలం లేక చంద్రబాబు పోటీ నుండి విరమించుకున్నారు. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో చంద్రబాబు వ్యవహరించిన అనైతికతను జనం చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా చంద్రబాబు నైతికత ఉంది.

సూపర్ సిక్స్‌ హామీలను సూపర్ చీట్‌గా మార్చేశారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. విద్య, వైద్యం, పోర్టుల మీద వైఎస్‌ జగన్ వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల అభివృద్ధి కోసం పని చేశారు వైఎస్ జగన్‌. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ పక్కనపెట్టారు. తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో తెలియకుండా పోయింది. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఐదు మెడికల్ కాలేజీలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియం, టోఫెల్ శిక్షణ వంటివన్నీ పక్కన పడేశారు అంటూ కామెంట్స్‌ చేశారు.

పథకాలకు డబ్బులు లేవు సరే... మరి అన్న క్యాంటీన్లకు ఎక్కడివి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement