Ram Gopal Varma: కేసీఆర్‌ ఆదిపురుష్‌: ఆర్జీవీ సంచలన ట్వీట్‌

Director Ram Gopal Varma Tweet On KCR BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి ఏం మాట్లాడినా సంచలనమే.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ ప్ర‌క‌టించిన వెంటనే సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ స్పందించారు. ‘కేసీఆర్‌ ఆది పురుష్‌’ అంటూ సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నా.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌ అయ్యాడంటూ ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
చదవండి: కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీపై ఈటల రాజేందర్‌ స్పందన 

​కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top