న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశా ల్లో భాగంగా శుక్రవారం ప్రతిపక్ష బీజేపీపై సీఎం అతిషి మార్లేనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కొర్పొరేషన్ బస్సులో బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అతిషి కౌంటర్ ఇచ్చారు.
అయితే ఆప్ ప్రతిపాదనపై రోహిణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆప్‌పై విమర్శలు గుప్పించారు. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబితేనే బస్ మార్షల్స్‌ను తొలగించామని చెప్పారు. దీనిపై సీఎం అతిషి స్పందిస్తూ..‘ నేను ముఖ్యమంత్రినే.. బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించాలని నేను కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పదేపదే చెబుతున్నాను. వీకే సక్సేనా కూడా ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట వింటుంటే.. మార్షల్స్‌ను తిరిగి నియమించగలరు’ అని కౌంటర్ ఇచ్చారు.
బస్ మార్షల్‌పై "నవంబర్ 10న మేం మీటింగ్ పెట్టాం. నవంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్‌కురిపోర్టు పంపాం. ఈరోజు నవంబర్ 29. ఇప్పుడు బస్ మార్షల్స్‌ను పునరుద్దరించే ప్రతిపాదన ఆయన వద్ద ఉంది. ఒకవేళ మీరు (విజేందర్ గుప్తా) బస్ మార్షల్స్ నియమాకానికి సంబంధించిన ఫైల్‌ను ఎల్ సంతకం చేయిస్తే.. మీపై ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టకుండా మా పార్టీని ఒప్పిస్తాను. అంతేగాక మీ తరపున నేను కూడా ప్రచారం చేస్తాను’ అని పేర్కొన్నారు.
VIDEO | "You (BJP MLA Vijender Gupta) just get the file for the appointment of bus marshals signed by the LG, I will convince my party not to field any candidate against you in Rohini, I will also campaign for you," said Delhi CM Atishi (@AtishiAAP) speaking in the Assembly,… pic.twitter.com/XxVHRuDwlO
— Press Trust of India (@PTI_News) November 29, 2024
కాగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆప్ సర్కార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బస్ మార్షలల్స్‌ను తిరిగి నియమించాలని కోరూతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానించి సిఫార్సు చేసిన ఫైల్ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా వద్ద పెండింగ్‌లో ఉంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులపై మార్షల్స్‌పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే మధ్య వాగ్వాదం గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment