
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని వ్యతిరేకించాల్సిన చంద్రబాబు–బీజేపీకి అనుకూలంగా మారి, జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే గొప్ప ఛాన్స్ పోగొట్టుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘చంద్రబాబు అన్ని విధాలా విఫలమయ్యారు. కేంద్రం అనేక ప్రజా వ్యతిరేక బిల్లుల్ని, చట్టాల్ని తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ వ్యతిరేకించలేదు’ అని తెలిపారు.