చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి: సీఎం జగన్‌

Published Fri, Apr 19 2024 5:46 PM

CM Jagan Aggressive Comments At Kakinada Memantha Siddham Meeting - Sakshi

సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌సీపీకీ ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్‌ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం జగన్‌ మండిపడ్డారు.

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని.. జైత్రయాత్రకు సిద్ధమని ప్రజలంతా సింహగర్జన చేస్తున్నారని తెలిపారు. మంచి చేసిన మీ బిడ్డకు తోడుగా ఉండేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 

పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి క్లాస్‌ వార్‌ జరుగుతోందన్నారు సీఎం జగన్‌. మీరేసే ఓటు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బాబు మార్క్‌ పాలన అని మండిపడ్డారు. రెండు ఓట్లు ఫ్యాన్‌ మీద వేస్తే జగన్‌ మార్క్‌ పాలన కొనసాగుతోందన్నారు.

సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం

 • జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు ఇక ముందుకూడా అందాలా.. లేదా?
 • వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే జగన్‌ మార్క్‌ సచివాలయాలు కొనసాగుతాయి
 • లేకుంటే చంద్రబాబు మార్క్‌ జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి
 • బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు.
 • ఓటేయడంలో పొరపాటు చేస్తే చంద్రముఖి నిద్ర లేచి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది.

మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా?

 • ఫ్యాన్‌కు ఓటేస్తేనే  రైతు భరోసా, ఉచిత పంటల భీమా
 • ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌
 • వైఎస్సార్‌సీపీకి ఓటేస్తేనే.. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ
 • ఫ్యాన్‌కు ఓటేస్తేనే..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మొడి, విద్యాదీవెన, వసతిదీవెన
 • ఫ్యాన్‌కు ఓటేస్తేనే..కాపు నేస్తం కొనసాగింపు
 • ఫ్యాన్‌కు ఓటేస్తేనే..నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం
 • మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా?
 • పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి పాలన కావాలా?

 • 14 ఏళ్లలో బాబు చేసిన మంచి పని కూడా లేదు.
 • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?
 • దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు
 • బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నాడు.
 • దత్తపుత్రుడికి ఎక్కడ టికెట్‌ ఇవ్వాలో కూడా బాబే నిర్ణయిస్తాడు.

జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ పారిపోయాడు

 • బాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌.. స్టాండ్‌ అంటే పవన్‌ స్టాండ్‌
 • ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.
 • చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు
 • జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్‌ పిఠాపురం వదిలేసి హైదరాబాద్‌ పారిపోయే రకం
 • బీఫామ్‌ బీజేపీ, కాంగ్రెస్‌, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదే
 • రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
 • బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది.
 • బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది.

నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి.

 • ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయండి
 • ఫ్యాన్‌కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగుతాయి.
 • కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయి
 • చంద్రబాబు సాధ్యం కాని హామీ ఇస్తున్నారు.
 • మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా?
 • పెత్తందారులతో  కలిసి దోచుకునే కూటమి కావాలా
 • గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారికి కూడా మంచి చేశాం

మీరే నాస్టార్‌ క్యాంపెయినర్లు

 • నా మీద వేయడానికి చంద్రబాబుకు గులకరాళ్లే మిగిలాయి
 • మీరే నాస్టార్‌ క్యాంపెయినర్లు
 • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
 • పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా?
 • ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?

ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు

 • 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?
 • సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
 • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
 • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
 • ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు
 • సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నాడు.
 • ఆ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?

Read this article in English : Click.. Package Star Has Got 4 Marriages & 4 Constituencies

Advertisement
 
Advertisement