
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కువిషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాల విషయంలో ప్రధాన సమాచార కమిషనర్ వద్ద ఉన్న రికార్డులలో ఎటువంటి సమాచారం లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద గత నవంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖను కోరారు.
ఈ అంశంలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ బదులిచ్చారని ఆ శాఖ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు.