గ్రేటర్‌లో వంద డివిజన్లే లక్ష్యం

BJP Decided With Target Of Winning 100 Divisions In GHMC Elections - Sakshi

బీజేపీ ‘గ్రేటర్‌’ సమర సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్ ‌: జీహెచ్‌ఎంసీలో వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీని 23 మంది పార్టీ ముఖ్యులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి విస్తృత ప్రచారం చేయాలని, సోమవారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఇంకా మీడియా, పబ్లిసిటీ, కార్యక్రమాల కోఆర్డినేషన్‌ తదితర పది రకాల కమిటీలను ఏర్పాటుచేశారు.

మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు: లక్ష్మణ్‌
గ్రేటర్‌ ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేవని, అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ ప్రజలను పట్టించుకోవట్లేదని, గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి 450 ఇళ్లు కట్టించారన్నారు. అంతకంటే ఎక్కువగా నిర్మిస్తే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

‘అప్పుడు హరీశ్‌.. ఇప్పుడు కేటీఆర్‌’
బీజేపీ ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ సోషల్‌ మీడియా విభాగాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ దుబ్బాక లో హరీశ్‌రావును ఎదుర్కొన్నామని, ఇపుడు కేటీఆర్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఇదే..
బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కన్వీనర్‌గా జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మ ణ్, జాయింట్‌ కన్వీనర్లుగా డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డిని నియమించారు. సభ్యులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పి.ము రళీధర్‌రావు, రాజాసింగ్, ఎన్‌.రాంచంద ర్‌రావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, మో త్కుపల్లి నర్సింహులు, డి.రవీంద్రనాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.రాములు, రాపో లు ఆనందభాస్కర్, ఎం.రఘునందన్‌రావు, జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శృతిని నియమించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top