‘డ్యాన్స్‌ చేయొచ్చు.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’

BJP Bhopal MP Pragya Thakur Gets Covid Shot At Home - Sakshi

ఇంటి దగ్గరే వ్యాక్సిన్‌ వేయించుకున్న భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌

పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భోపాల్‌: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్‌ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రగ్యా ఠాకూర్‌ ఇంటి దగ్గర వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. డ్యాన్స్‌ చేయడానికి ఓపిక ఉంటుంది కానీ ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోలేరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ వివరాలు..

తాజాగా రెండు మూడు రోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ప్రగ్యా ఠాకూర్‌ తన నివాసంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక నియమం కింద ప్రగ్యా ఠాకూర్‌ తన నివాసంలోనే వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు రాష్ట్ర పాలన అధికారులు తెలిపారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ అధికారి సంతోష్‌ శుక్లా మాట్లాడుతూ.. ‘‘పాలసీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు. ఈ నియమం ప్రకారం ప్రగ్యా ఠాకూర్‌ నివాసానికి వెళ్లి ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేశాం. అంతేకానీ మేం నియమాలను ఉల్లంఘించలేదు’’ అని తెలిపారు. 

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తుంది. ‘‘మన భోపాల్‌ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ కొద్ది రోజుల క్రితమే బాస్కెట్‌ బాల్‌ ఆడారు.. ఆమె నివాసంలో జరిగిన ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేశారు. కానీ వ్యాక్సిన్‌ మాత్రం ఇంటి దగ్గరే వేయించుకున్నారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వరకు ప్రతి బీజేపీ నేత ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.. ప్రగ్యా ఠాకూర్‌ తప్ప. డ్యాన్స్‌ వేయాడానికి ఓపిక ఉంటుంది.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’’ అంటూ కాంగ్రెస్‌ నేత నరేంద్ర సులజా తీవ్ర విమర్శలు చేశారు. ప్రగ్యా ఠాకూర్‌పై నెటిజనులు కూడా ప ఎద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-07-2021
Jul 15, 2021, 20:39 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది...
15-07-2021
Jul 15, 2021, 17:46 IST
దురదృష్టం కొద్ది ప్రపంచం ఇప్పుడు థర్డ్‌వేవ్‌ ప్రారంభ దశలో ఉంది
15-07-2021
Jul 15, 2021, 17:16 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 93,785 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 2,526 కరోనా...
15-07-2021
Jul 15, 2021, 09:56 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా కేసులు నమోదవ్వగా...
15-07-2021
Jul 15, 2021, 07:31 IST
యశవంతపుర: కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. పూణె నుంచి హుబ్లీకి బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే ప్రయాణికుల వద్ద కరోనా...
14-07-2021
Jul 14, 2021, 17:11 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,591 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 15 మంది మృతి చెందారు. తాజాగా 3,329 మంది కరోనా బాధితులు...
13-07-2021
Jul 13, 2021, 18:35 IST
దంతేవాడ (చత్తీస్‌ఘడ్‌) : మావో​యిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్‌ మృతి చెందారు. ఇన్ఫెక్షన్...
13-07-2021
Jul 13, 2021, 17:27 IST
తిరువనంతపురం: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌ మరో సారి వైరస్‌ బారిన పడ్డారు. ఇండియాలో కేరళకు...
13-07-2021
Jul 13, 2021, 17:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 2,567 కరోనా కేసులు...
13-07-2021
Jul 13, 2021, 15:20 IST
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కరోనా పరిస్థితులపై...
13-07-2021
Jul 13, 2021, 10:40 IST
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు కరోనాపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు....
13-07-2021
Jul 13, 2021, 07:44 IST
మెట్రో రైళ్లలో కరోనా నియమాలను పాటించకపోతే రూ.250 జరిమానా
13-07-2021
Jul 13, 2021, 02:29 IST
వాషింగ్టన్‌: కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న నాసల్‌ వ్యాక్సిన్‌(ముక్కు ద్వారా అందించే టీకా) ఆశాజనక ఫలితాలనిస్తోంది. క్లీనికల్‌ ప్రయోగాల్లో భాగంగా ఎలకలకు,...
13-07-2021
Jul 13, 2021, 00:52 IST
ముంబై సెంట్రల్‌: మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ తగ్గిందని భావిస్తున్న తరుణంలో గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా...
12-07-2021
Jul 12, 2021, 20:54 IST
ముంబై:  మహారాష్ట్రకు నెలకు 3 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే...
12-07-2021
Jul 12, 2021, 17:38 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా1,578 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 22 మంది మృతి చెందారు. తాజాగా 3,041 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ ...
12-07-2021
Jul 12, 2021, 17:37 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ వేళ దేశంలో పంటల ఉత్పత్తి రికార్డ్‌ స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం  నాబార్డ్‌ వార్షికోత్సవంలో...
12-07-2021
Jul 12, 2021, 10:52 IST
సాక్షి, బెంగళూరు: కోవిడ్‌– 19 మహమ్మారి గుండెకు తీవ్ర చేటు చేస్తోంది. వైరస్‌ నుంచి కోలుకున్న యువకుల్లో రక్తం గడ్డ...
12-07-2021
Jul 12, 2021, 03:24 IST
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే థర్డ్‌ వేవ్‌ ఆందోళన మొదలైంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌...
12-07-2021
Jul 12, 2021, 00:24 IST
 ముంబై: కరోనా రెండో వేవ్‌ ఇంకా తగ్గలేదని అందరూ జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పినా ప్రజలు నిబంధనలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top