ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామా

Babul Supriyo Resigns From Loksabha MP - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత బాబుల్‌ సుప్రియో లోక్‌సభ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేశారు. నెల రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి, రాజీనామా పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు నా మనసెంతో వేదనకు గురవుతోంది.

నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, పార్టీ అధ్యక్షుడు నడ్డాకు, హోం మంత్రి అమిత్‌ షాకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి రెండు పర్యాయాలు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.  

చదవండి: యూపీలో 40% టికెట్లు మహిళలకే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top