ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి | Ambati Rambabu Fires On Tdp Mahanadu And Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి

May 30 2025 5:02 PM | Updated on May 30 2025 5:22 PM

Ambati Rambabu Fires On Tdp Mahanadu And Chandrababu

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.

‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్‌ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది.

..అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్‌కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement