పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత అందరి బాధ్యత

Oct 3 2026 12:26 AM | Updated on Oct 3 2026 12:26 AM

అప్పుడు గుంటూరు.. ఇప్పుడు ఉప్పట్ల.. మంథనిరూరల్‌: ఒకప్పుడు మిర్చి నారు కోసం గుంటూరు వరకు వెళ్లే రైతులు.. ఇప్పుడు ఉప్పట్ల గ్రామం నుంచే తెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన రైతు పోగుల తిరుపతి ఏడేళ్లుగా మిర్చినారు డ్రిప్‌ పద్ధతిన సాగు చేస్తున్నాడు. ఆండ్రాడ్‌, ఎండ్‌పై లాంటి రకాలను గుంటూరు నుంచి తీసుకొచ్చే రైతులపై అదనపు భారం ప డేది. అయితే, మిర్చిపంట పండించే రైతులు త మకు ఇష్టమైన విత్తనాలను తీసుకువచ్చి తిరుపతికి ఇస్తే పొలంలో నాటి నారువరకు పెంచి తిరిగి అప్పగిస్తున్నాడు. ఇందుకు ప్యాకెట్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు అద్దె తీసుకుంటాడు. సుమారు 45 రోజుల నుంచి 50రోజుల వరకు నారు నాటే స్థాయికి చేరుతుంది. అయితేన నారు పెంపకం, ఇతర పనుల కోసం తనతోపాటు మరో 15మంది వరకు కూలీలకు తిరుపతి ఉపాధి కల్పిస్తున్నాడు. అంతేకాదు.. ఉప్పట్ల, గుంజపడుగు, విలోచవరం, పోతారం తదితర అనేక గ్రామాల రైతులకు స్థానికంగా మిర్చినారు లభించడంతో ఆర్థిక భారం తప్పుతోందని సంతోషంగా చెబుతున్నారు.

జ్యోతినగర్‌: పరిశుభ్రత, పర్యావరణ పరిరక్ష ణ, సుస్థిరత అందరి బాధ్యతని ఎన్టీపీసీ సీజీ ఎం ముకుల్‌రాయ్‌ అన్నారు. రామగుండంలో ని ఎన్టీపీసీ చేపట్టిన స్వచ్ఛతా పక్షోత్సవం శుక్రవారం ముగిసింది. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి సీజీఎం పూలమాల వేసి నివాళి అ ర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన ము గింపు కార్యక్రమంలో జీఎం మనీష్‌ అగర్వాల్‌తో కలిసి మాట్లాడారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులకు బహుమతులు అందజేశారు.

‘సూర్య ఘర్‌’పై అవగాహన

గోదావరిఖనిటౌన్‌: పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బి జిలీ యోజన పథకంపై స్థానిక ఎన్పీడీసీఎల్‌ కా ర్యాలయంలో ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్‌, వారాహి ఎనర్జీస్‌ మేనేజర్‌ బూడిద సతీశ్‌ శుక్రవారం సో లార్‌ ఎనర్జీపై అవగాహన కల్పించారు. సౌర వి ద్యుత్‌ వినియోగం, పథకం ద్వారా లభించే ప్ర యోజనాలు, సబ్సిడీ, రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏ ర్పాటుపై వివరించారు. ఈ పథకం ద్వార ప్రతీ ఇంటికి సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీ సుకురావడంతోపాటు విద్యుత్‌ పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యమని వారు వివరించారు.

ఉప సర్పంచుల జాప్యానికి చెక్‌

పెద్దపల్లి: చెక్కులు, బిల్లులపై సంతకాలు చేయకుండా నిర్లక్ష్యం వహించే ఉపసర్పంచులకు పంచాయతీరాజ్‌ శాఖ చెక్‌ పెట్టింది. ఏడు పనిదినాల్లోగా డిజిటల్‌ సిగ్నేచర్‌ చేయకపోయినా, నిరాకరించినా కలెక్టర్‌ విచారణ చేపట్టాలని గు రువారం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యా యి. పల్లెల్లో పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, అత్యవసర అభివృద్ధి పనుల చెల్లింపు ల్లో జాప్యంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం తాజా గా ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొంటున్నా రు. అదేవిధంగా ఉపసర్పంచ్‌ చెక్కులపై సంతకం, డ్రాయింగ్‌ అధికారాలను రద్దు చేసి.. ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో లేదా ఎంపీడీవోకు బదిలీ చేసేలా కలెక్టర్‌ ని ర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తద్వా రా ప్రజలకు నిరంతర సేవలు అందించడంతోపాటు అభిదృద్ధి పనులకు ఆటంకం కలుగుకుండా ఉత్తర్వులను తక్షణమే అమలు చేయా లని కలెక్టర్లను ఆ ఉత్వర్వుల్లో ఆదేశించింది.

అడవులను కాపాడుకోవాలి

మంథనిరూరల్‌: అటవీ సంపదను అందరూ కాపాడుకోవాలని మంథని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎంవీ నాయక్‌ కోరారు. శుక్రవారం వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఖాన్‌సాయిపేట, భట్టుపల్లి, ఎగ్లాస్‌పూర్‌ గ్రామాల్లో అటవీ సంపదపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతన్నారు. అనంతరం వన్యప్రాణి అభయారణ్యంలో క్లీనింగ్‌ చేపట్టారు. పెద్దపల్లి ఎఫ్‌ఆర్వో సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement