రామగుండం: స్థానిక అంబేద్కర్ చౌరస్తా – ఆబాది రామగుండం వరకు రోడ్డు విస్తరణ కొనసాగుతోంది. భూగర్భంలో పగిలిన తాగునీటి పైపులైన్లను పు నరుద్ధరించకుండానే తారురోడ్డు పనులు పూర్తి చే యడంతో లీకేజీతో రహదారికి రంధ్రం పడింది. ఈ ఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట ఏకంగా నడిరోడ్డుపై తాగునీ టి పైపులైన్ వాల్వు, ఇతర పైపు బయటకు ఉండగా నే రోడ్డు నిర్మిస్తున్నారు. మరోఐదు దశాబ్దాల అవస రాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నా యి. రోడ్డు మధ్య ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే.. రో డ్డు పూర్తయ్యాక తొలగిస్తామని ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ పేర్కొంటున్నారు. రహదారి నిర్మాణంపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీ క్షేత్ర పరిశీలన చేసి లోపాలను ముందుగా గుర్తించి, పునరుద్ధరించిన తర్వాత పనులు పూర్తిచేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తాగునీటి పైపులైన్లు.. వాల్వులు
రహదారుల నిర్మాణం తీరే ప్రత్యేకం


