జ్యోతినగర్: సమస్యల పరిష్కారంలో ఎన్టీపీసీ కార్మికులకు ఐఎన్‌టీయూసీ అండగా ఉంటుందని ఆ యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీం పాషా అన్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లో గల యూనియన్ కార్యాలయంలో సీహెచ్‌పీ ప్యాకేజీ– 8 డిప్లొమో కార్మి కులు శుక్రవారం ఐఎన్‌టీయూసీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్ అధ్యక్షత వహించా రు. బాబర్ సలీం పాషా మాట్లాడుతూ, ప్రతీనెల 7లోగా వేతనాలు చెల్లించాలన్నారు. కొందరు కాంట్రాక్టర్లు గడువులో వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బొద్దున శ్రీనివాస్, జమీల్, గోషిక రవి, కదిరె శ్రీనివాస్, అజార్ పాషా, వెంకటరాజం, వకార్, ప్రణయ్‌గౌడ్, శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


