సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

న్యూస్‌రీల్‌

‘నీట్‌’గా పీజీ పరీక్ష

కళ్లద్దాలను వదలకుండా..

సీసీ కెమెరాల పర్యవేక్షణ

చెవిలో ఏమైనా ఉందా?

‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పెద్దపల్లిలో రెండు కేంద్రాలతోపాటు మంథని జేఎన్టీయూలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైన పీజీ కోర్సులో ప్రవేశాల కోసం చేపట్టిన ఈ పరీక్షకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సెల్‌ఫోన్‌లు, పర్స్‌లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు, ఆభరణాలు ధరించొద్దని ఇప్పటికే సూచనలు చేసిన అధికారులు.. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 230మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కానీ, పెద్దపల్లిలోని మదర్‌ తెరిసా ఇంజినీరింగ్‌ కాలేజీలో 70మందికి 69 మంది, ట్రినిటీ డిగ్రీకాలేజీలో 60 మంది, జేఎన్టీయూలో100 మందికి 98 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.

– పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌/రామగిరి/సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement