గోదావరిఖని: ఒంటరిగా ఉన్న మహిళను ఏమార్చి.. ఆపై తప్పుదారి పట్టించి లైంగిక దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం మహిళా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పోలీసుల కథనం ప్రకారం.. ఓ మహిళ తన సోదరులకు రాఖీ కట్టేందుకు స్థానిక ఫైవింక్లయిన్‌కాలనీ బస్టాప్ వద్ద ఈనెల 28న ఉదయం 6.30గంటలకు వేచిచూస్తోంది. అక్కడి నుంచి జైపూర్ వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా.. అటుగా బైక్‌వచ్చిన ఓ యువకుడు.. ‘అత్తమ్మా.. అంతా మంచేనా’ అని మాటల్లో దింపాడు.. ‘నీకుమారుడు నాకు తెలుసు.. నిన్ను బస్టాండ్ వరకు తీసుకెళ్తా’ అని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. అయితే, తానుకూడా మంచిర్యాల వెళ్తున్నానని, జైపూర్ వద్ద దింపుతానని చెప్పి వేరే మార్గంలోకి బైక్ మళ్లించాడు. ఆ తర్వాత జీడీకే–2వ గని వైపు తీసుకెళ్లాడు. ఇటువైపు ఎందుకు తీసుకెళ్తున్నావని మహిళ అరుస్తున్నా వినలేదు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత దుండగుడి సెల్‌ఫోన్ కిందపడడంతో బాధితురాలి చేతికి చిక్కింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని లైంగికదాడి కేసు నమోదు చేశారు.
పీడీయాక్ట్ నమోదుకు సిద్ధం..!
నిందితుడిపై గతంలో నమోదైన కేసులను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలోనే గోదావరిఖని వన్‌టౌన్‌లో రెండు, ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి ఇలాంటి కేసు నమోదైనట్లు వెలుగులోకి వ చ్చింది. సదరు నిందితుడిపీ పీడియాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
50 ఏళ్ల పైబడిన వారిపై కన్నేసి..
ఒంటరిగా ఉంటున్న యాబై ఏళ్ల వయసు పైబడిన మహిళలే లక్ష్యంగా ఆ యువకుడు లైంగికదాడి చేస్తున్నాడని, మూడు కేసుల్లో నిందితుడైన ఆ వ్యక్తిగా ఇలాంటి దాడులకు పాల్పడటం కొత్తేమీ కాదంటున్నారు. ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒంటరి మహిళపై లైంగికదాడి
గతంలోనూ ఇలాంటి ఘటనలు
పోలీసుల అదుపులో నిందితుడు!


