గోదావరిఖనిటౌన్: పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. జూనియర్ సివిల్ జడ్జి నుంచి సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందిన జడ్జిని గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా అదనపు న్యాయస్థానంలో ఆత్మీయ సన్మానం జరిపారు. జడ్జి మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా సీనియర్ల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా ఏజీపీ శాంతన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ముచ్ఛకుర్తి కుమార్, మహిళా ప్రతినిధి ముక్కెర అంజలి, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి ఆసంపల్లి రవీందర్, గ్రంథాలయ కార్యదర్శి గజ్జెల ప్రసన్న, ప్రతినిధులు జవ్వాజి శ్రీనివాస్, జాగిరి రాజయ్య, చిదురాల రమేశ్, షానవాజ్, దాట్ల కిరణ్‌కుమార్, మార్కపురి తిలక్, కిషన్‌రావు, కొసన శ్రీనివాసరావు, సిరిగ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం జడ్జికి వీడ్కోలు
ధర్మారం: నందిమేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత పదోన్నతిపై బదిలీ అయ్యారు. మేడారం కోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జడ్జిని ఘనంగా సన్మానించారు. అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఆకారి రాజేశం, కోశాధికారి నూనె సత్యారాయణ, కల్చరల్ సెక్రటరీ భీమారపు సంపత్, కార్యవర్గ సభ్యులు బీసవేని మల్లేశ్వరి, పురాణరం సందీప్‌కుమార్, ఇన్‌చార్జి ఏజీపీ ఉప్పు రాజు, న్యాయవాదులు నార అశోక్‌రెడ్డి, ఎంపెల్లి ప్రకాశ్, ఆల్క వినోద్, గూడ జితెందర్‌రెడ్డి, రావుల రజిత, ఎలిగేటి కల్యాణి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్


