● విశ్వక్ సేన్
డిసెంబరులో విశ్వక్ సేన్ ‘లెగసీ’ థియేటర్స్‌కి రానుంది. విశ్వక్ సేన్ హీరోగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్త్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైంది. విశ్వక్ సేన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం అంశాలతో సాగే ఈ కథలో ఒక వారసుడు ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను తన తండ్రి గతానికి సంబంధించి దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథనం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత.


