బలమైన భావోద్వేగాల సహా... | - | Sakshi
Sakshi News home page

బలమైన భావోద్వేగాల సహా...

Aug 28 2026 2:39 AM | Updated on Aug 28 2026 2:39 AM

బలమైన భావోద్వేగాల సహా...

శివ కుమార్‌ కాసారం హీరోగా నిషాంత్‌ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ’ (లైఫ్‌ ఆఫ్‌ సంజు). శ్వేతా లక్ష్మణ్‌, వ్రజన పాండ్య హీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్‌ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను... చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్‌ ఉన్న సినిమాని ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ–‘‘సహా–ది బిగ్గెస్ట్‌ స్మాల్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది డికేడ్‌’ అని పోస్టర్‌ పెట్టారు. ఇలా పెట్టాలంటే ధైర్యం కావాలి. సినిమా ఆ అంచనాలను అందుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘చిన్న సినిమా బ్లాక్‌బస్టర్‌ కొడితే ఎలా ఉంటుందో మా చిత్రంతో చూపిస్తాం’’ అన్నారు శివకుమార్‌. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు నిరుత్సాహపడితే అమీర్‌పేట్‌ సెంటర్‌లో నిలబడి గుండు గీయించుకుంటాను’’ అని శ్వేతా లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలున్నాయి’’ అన్నారు నిశాంత్‌. ‘‘సహ’ గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు వ్రజన పాండ్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement