సర్కారు దవాఖానాలో సేవలు చాలాబాగా అందు తున్నాయ్. డాక్టర్లు ఓపికగా పరీక్షించి మందులు రాసిఇస్తున్నరు. ప్రైవేట్ దవాఖానా కన్నా సర్కారులోనే చాలామంచి వాతావరణంలో సేవలందుతున్నయి.
– విజయ, పెద్దపల్లి
వైద్యం ఉచితం
జిల్లా ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నాం. 50 పడకలను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసి రూ.51లక్షలతో భవనం నిర్మిస్తున్నాం. సీటీ స్కాన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం.
– విజయరమణారావు, ప్రభుత్వ విప్
ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారం
పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ శ్రీహ ర్ష అన్ని వసతులు కల్పించారు. వారి సహకారంతోనే నవజాతశిశువులు, ఆర్థో పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. అందుకే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
– శ్రీధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్


