యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Jul 29 2026 12:22 AM | Updated on Jul 29 2026 12:22 AM

రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నవాబ్‌పేట్‌లోని బుడగజంగం కాలనీకి చెందిన బోడకుర్తి సుజాత(22) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు ఊరికివెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య గల కారణా లు తెలియాల్సి ఉంది. రామగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మృతి

ఫెర్టిలైజర్‌సిటీ: మాతంగికాలనీకి చెందిన మహాత్మ పద్మ(48) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత మార్చి 23న మంచిర్యాలకు వెళ్లే క్రమంలో ఇంటినుంచి నడుచుకుంటూ ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు వద్దకు చేరుకుంది. ఇదేసమయంలో అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం రాత్రి మృతి చెందింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌ కిరణ్‌ కేసు నమోదు చేసుకొన్నారు.

విద్యుత్‌ భద్రత తనిఖీ

గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–1,3 గనిని ఎలక్ట్రికల్‌ డీడీఎంఎస్‌ కోమల్‌చౌదరి మంగళవారం తనిఖీ చేశారు. విద్యుత్‌ భద్రత, పరికరాల నిర్వహణ, నాణ్యత ప్రమాణాలు, గని కార్యకలాపాలపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్యాన్‌హౌస్‌, ఇండోర్‌ స్విచ్‌స్టేషన్‌, అవుట్‌డోర్‌ సబ్‌స్టేషన్లను సందర్శించారు. ఆయన వెంట గని ఏజెంట్‌ రమేశ్‌, మేనేజర్‌ సుధీర్‌, సేఫ్టీ ఆఫీసర్‌ మహేశ్‌ తదితరులు ఉన్నారు.

ప్రైవేట్‌ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు

● ఇద్దరు విద్యార్థులకు గాయాలు

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్‌ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్‌ నుంచి కృష్ణానగర్‌ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్‌ నుంచి కొత్తబస్టాండ్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్‌లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్‌ వాహన డ్రైవర్‌, జగిత్యాల అర్బన్‌ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌ మారంపల్లి నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement