ఒడిసి పడితేనే జల‘సిరి’ | - | Sakshi
Sakshi News home page

ఒడిసి పడితేనే జల‘సిరి’

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

పెద్దపల్లి/రామగిరి: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వానదేవుడు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నా యి. ముంచుకొన్న నీటికొరతను అధిగమించేందు కు, నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతీవర్షపునీటి బొట్టును ఒడిసిపడితే నీటిభద్రత సాధ్యమనే భావనతో జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గ్రామాల్లో జలసంరక్షణను అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టేందుకు కార్యాచరణ సి ద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట ఊరుకో ఊటకుంట నినాదంతో ముందుకు సాగుతోంది. వీబీజీ రామ్‌జీ ఉపాధిహామీ ద్వారా ప్రజలను ఇందులో భాగస్వామం చేసేలా ఆదేశాలు జారీచేసింది.

ఇంటికో గుంత.. పొలానికో కుంట

జిల్లాలో సంప్రదాయ పంటలకు బదులు తక్కువ నీటివినియోగం కలిగే ప్రత్యామ్నాయ పంటలపై జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతులకు అవ గాహన కల్పిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో కురిసే ప్రతీవర్షపు బొట్టును వృథాగా పోనివ్వకుండా నే లలో నిల్వ చేయడం ద్వారా భూగర్భజలాలను వృద్ధి చేయొచ్చని, సాగునీటి వనరులను బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటికో ఇంకుడుగుంత నిర్మాణానికి రూ.6 వేల చొప్పున వెచ్చించనుంది. రైతు భూకమతంలో పంటకుంట పరిమాణం ప్రకారం రూ.2.50 లక్షల నుంచి రూ.4లక్షల వరకు సాయం అందించాలని అంచనా వేసింది. ఆవాస ప్రాంతాల్లో సామూహిక నీటి అవసరాలు తీర్చేందుకు ఊరకుంటల నిర్మాణానికి సైతం ప్రతిపాదిస్తోంది. ఊరకుంట నిర్మాణానికి రూ.10 లక్షలు వెచ్చించాలని నిర్ణయించింది. కూలీల వేతనాలతోపాటు మెటీరియల్‌ కాంపోనెంట్‌ను ప్రభుత్వం అందించనుంది.

కూలీలకు ఉపాధి.. భూగర్భ జలాల పెంపు

జలసిరి ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు భూగర్భజలాల వృద్ధి సాధ్యమని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, కరువు ప్రభావం తగ్గించడానికి ఈప్రక్రియ కీలకమని గ్రామీణాభివృద్ధి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జలసంరక్షణ క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పనులకు ప్రాధాన్యం

వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం ‘తెలంగాణ జలసిరి’ రూపొందించింది. ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరుకో ఊరకుంట నిర్మించడం దీని ఉద్దేశం. ప్రతీ వర్షపు నీటిచుక్కను ఒడిసి పట్టి నేలలో ఇంకించడం ద్వారా బోరుబావుల నీటిమట్టం పెరుగుతుంది. సాగునీటి సమస్య తీర్చడంతోపాటు మొక్కలు చెట్లుగా ఎదిగి పచ్చదనం పెరుగుతుంది. పర్యావరణం మెరుగుపడుతుంది.

– కాళిందిని, డీఆర్‌డీవో

వీబీజీ రామ్‌జీ ఉపాధిహామీలో ‘జలసిరి’

ఇంటికో ఇంకుడుగుంత తప్పనిసరి

పొలానికో పంటకుంట.. ఊరికో ఊటకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement