రక్షణ వారోత్సవాలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రక్షణ వారోత్సవాలకు ఏర్పాట్లు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

గోదావరిఖని: సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన –2025 రక్షణ వార్షికోత్సవాల్లో సత్తాచాటిన గనులు, ఓసీపీలు, ఇతర విభాగాలకు బహుమతులు అందజేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 ఏరియాలకు చెందిన అన్నివిభాగాల పేర్లను యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఓసీపీలు, భూగర్భ గనులు, సీహెచ్‌పీలు, వర్క్‌షాప్‌లు, స్టోర్స్‌ తదితర విభాగాల్లో రక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన గనులకు బహుమతులను అందించేందుకు సిద్ధం చేశారు. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీతోపాటు సింగరేణి డైరెక్టర్ల బహుమతులు అందజేస్తారు.

ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుల్లో..

ఓసీపీ గ్రూప్‌–వన్‌లో ఓవరాల్‌ ప్రథమ బహుమతి జేవీఆర్‌ ఓసీపీ, ద్వితీయ బహుమతి ఓసీపీ–3 సాధించాయి. గ్రూప్‌–2లో ప్రథమ స్థానం కేటీకే ఓసీపీ–2, మణుగూరు ఓసీపీ ద్వితీయస్థానం పొందాయి. గ్రూప్‌–3 ఓసీపీల్లో కొత్తగూడెం ఓసీపీ ప్రథమ, రెండోస్థానం కిష్టారం ఓసీపీ సాధించింది.

భూగర్భ గనుల్లో..

గ్రూప్‌ వన్‌లో ప్రథమ స్థానం వకీల్‌పల్లి, రెండోస్థానంలో ఆర్కే–7, గ్రూప్‌–2లో కేటీకే–5,5ఏ మొద టి, ఆర్కే–5 రెండోస్థానం సాధించాయి. గ్రూప్‌– 3లో ఎస్‌ఆర్‌పీ–3,3ఏ మొదటి, కాసిపేట –2వ గని రెండోస్థానం పొందింది.

సీహెచ్‌పీలు..

మొదటిస్థానం జేవీఆర్‌ సీహెచ్‌పీ, రెండోబహుమతి ఓసీపీ–1, శ్రీరాంపూర్‌ సీహెచ్‌పీ మూడో బహుమతి సాధించాయి. కార్పొరేట్‌ సెంట్రల్‌ వర్క్‌షాప్‌ మొదటి, సబ్‌స్టేషన్‌ విభాగంలో కార్పొరేట్‌ సబ్‌స్టేషన్‌ మొదటి బహుమతి పొందింది. వీటితోపాటు పలు విభాగాలకు మొదటి, రెండు, మూడో బహుమతులను ప్రకటించారు.

ప్రమాదాల్లేని సూపర్‌వైజర్లు వీరే

సింగరేణిలో ప్రమాదాలు లేని సూపర్‌వైజర్లను ఏరియాకు ఒక్కరి చొప్పున యాజమాన్యం ఎంపిక చేసింది. ఎంపికై న వారి వివరాలు: జీడీకే–1,2ఏకు చెందిన ఎ.స్వామి(మైనింగ్‌ సర్ధార్‌), వకీల్‌పల్లిగనికి చెందిన టి.బానయ్య(హెడ్‌ ఓవర్‌మెన్‌), ఓసీపీ–1కు చెందిన ఎం.ప్రభాకర్‌రెడ్డి(హెడ్‌ ఓవర్‌మెన్‌), ఏఎల్‌పీ గనికి చెందిన ఎన్‌.సాంబయ్య(హెడ్‌ ఓవర్‌మెన్‌), కేటీకే–5,5ఏకు చెందిన కె.తిరుపతిరెడ్డి(సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌), పీవీకే–5వ గనికి చెందిన బి.గోవర్ధన్‌రావు(హెడ్‌ ఓవర్‌మెన్‌), జేవీఆర్‌ ఓసీపీకి చెందిన ఎస్‌.మహేందర్‌(హెడ్‌ ఓవర్‌మెన్‌), పీకే ఓసీపీకి చెందిన సుబ్బరాజు(హెడ్‌ ఓవర్‌మెన్‌), జేకే–5 ఓసీపీకి చెందిన కె.శ్రీనివాసరావు(హెడ్‌ ఓవర్‌మెన్‌), ఖైరిగూడ ఓసీపీ సీహెచ్‌ మల్లేశ్‌(హెడ్‌ ఓవర్‌మెన్‌), కేకే–5గనికి చెందిన రాహుల్‌ రాంచరణ్‌(సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌), ఆర్కే న్యూ టెక్‌కు చెందిన బి.చంద్రమౌళి(హెడ్‌ ఓవర్‌మెన్‌).

బహుమతుల పంపిణీకి చర్యలు

ఎన్టీపీసీలో వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement