సిరిసిల్ల/బోయినపల్లి(చొప్పదండి): చేపల సంతతి అభివృద్ధికి మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను నిషేధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల్లో రెండు నెలలపాటు చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం.సౌజన్య సోమవారం తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల సంతతి పెరిగే కాలం కావడంతో చేపల వేట విరామానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల పరిసర గ్రామాల్లోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు చేపల వేటకు వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించాలని జీపీలకు తెలిపారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
జూలై, ఆగస్టు నెలల్లో వేట నిషేధం
చేపల సంతతి అభివృద్ధికి మత్స్యశాఖ నిర్ణయం


