జగిత్యాల: కొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకుంటున్నారని పేర్కొంటూ జిల్లా కేంద్రానికి చెందిన రాపర్తి గంగాధర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ధరూర్ శివారులోని సర్వే నంబరు 49, 50, 67లోగల తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు సాయంత్రం 5.30 గంటలకు కుమారులతో కలిసి వచ్చాడు. కమిషనర్ చాంబర్‌కు వెళ్లి మాట్లాడుతూనే కుర్చీలోనే పడిపోయాడు. కార్యాలయం బయట ఉన్న కుమారులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. గంగాధర్ చీమలు, పురుగుల మందు తాగాడని నిర్ధారించారు.


