బీసీలు రాజకీయంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలు రాజకీయంగా ఎదగాలి

Jun 30 2026 1:00 AM | Updated on Jun 30 2026 1:00 AM

పెద్దపల్లి: బీసీలు రాజకీయంగా ఎదగాలని.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా స్‌గౌడ్‌ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీసీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపించడమే బీసీ ఉ ద్యమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఓటు అనే ఆయుధంతో అగ్రకులాల ఆధిపత్యాన్ని ఓడించాలని కోరారు. ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నాయని మండిపడ్డా రు. బీసీలు బానిసలుగా కాకుండా బాద్‌షాలుగా ఎదగాల ని కోరారు. కులాలవారీగా చీలిపోకుండా.. ఎస్సీ, ఎస్టీ, మై నారిటీలతో కలిసి బీసీలు ఐక్యంగా పోరాడితేనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. బీసీ భవనం ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నామని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉష స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుల్కచర్ల శ్రీనివాస్‌, బీసీ విద్యార్థి జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ గంట రాములుయాదవ్‌, ఫిషరీస్‌ మాజీ చైర్మన్‌ చేతి ధర్మయ్య, బీసీ జేఏసీ జిల్లా వైస్‌చైర్మన్‌ కొండ సతీశ్‌, మహిళా కన్వీనర్‌ సిరవేణి స్వప్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు మండే లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికే ఆదర్శం పెద్దపల్లి ఆస్పత్రి

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు సాధించడం జిల్లాకు గర్వకారణమని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ డి.శ్రీధర్‌ను సన్మానించారు. అనంతరం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement