జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన చిలువేరి నీరజ (45) పాముకాటుతో ఆది వారం రాత్రి మృతిచెందింది. నీరజ ఆదివారం సాయ ంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నిద్రి స్తున్న సమయంలో నాగుపాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది.
జమ్మికుంట: బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిల్లపల్లి గ్రామానికి చెందిన తోట వినయ్, మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన నూకల వెంకటయ్య(70) బైక్‌ను గ్రామ శివారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి కొడుకు నూకల ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి..
గంగాధర: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా నుంచి బోయినపల్లి వెళ్లే దారిలో ఆదివారం రాత్రి పిట్టలపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని వెంకంపల్లి గ్రామానికి చెందిన గుండవేణి కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కొమురయ్య తన గొర్రెల మంద వద్దకు వెంకంపల్లి నుంచి పిట్టలపల్లి వైపు ఎక్సెల్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో బోయినపల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. కొమురయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విలాసాగర్‌కు చెందిన కారు డ్రైవర్ పోలె మహేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సొంతూరిలో ఉపాధి లేక గల్ఫ్ వెళ్లిన వలసజీవి అక్కడే గుండెపోటుతో మృతిచెందగా.. 23 రోజులకు మృతదేహం స్వగ్రామానికి చేరింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన బత్తుల నర్సయ్య(42) విధుల్లో ఉండగానే గుండెపోటుతో ఈనెల 6న మృతిచెందాడు. సోమవారం మృతదేహం నారాయణపూర్‌కు చేరడంతో మృతుని భార్య రేణుక, కొడుకు రాకేశ్, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటి వరకు మృతదేహాన్ని తెచ్చేందుకు వాహనాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ సమకూర్చారు. అంతిమయాత్రలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, అదనపు తహసీల్దార్లు బుర్క గోపాల్, ఎలుసాని ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ మజీద్ తదితరులు పాల్గొన్నారు.


