కోల్‌సిటీ: నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చడం లక్ష్యంగా రామగుండం బల్దియా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పందుల పెంపకందారులకు పునరావాసం కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్, వ రంగల్ వంటి మహానగరాల్లో అమలవుతున్న డ్రై వర్ కం ఆపరేటర్ విధానాన్ని రామగుండంలో ప్రవే శ పెట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా ఏడు డివిజన్లలో అ మలు చేస్తోంది. టెండరు ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీకి ఇంటింటా చెత్త సేకరణ బాధ్యత అప్పగించింది. సుమారు 20 రోజులుగా ఈ విధానం అమలు చేస్తోంది. దీనిని ర్యాగ్ పిక్కర్లు వ్యతిరేకిస్తున్నారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా యత్నించగా స్పందించలేదు.
ఏడు డివిజన్లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా..
నగరంలోని 34, 40, 47, 49, 51, 52, 60వ డివిజన్లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రైవేట్ ఏజెన్సీలతో ఇంటింటా చెత్త సేకరిస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ కు చెందిన ఏడు ఆటోట్రాలీలను ఏజెన్సీకి అప్పగించారు. ఒక్కోట్రాలీకి రూ.50 వేల చొప్పున డిపాజి ట్ సేకరించారు. ట్రాలీల నిర్వహణ, డ్రైవర్లు, కార్మికుల బాధ్యత ఏజెన్సీదే. ఏజెన్సీ ఇంటింటా చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది.
వ్యతిరేకిస్తున్న ర్యాగ్ పిక్కర్లు
కొత్త విధానాన్ని ర్యాగ్ పిక్కర్లు వ్యతిరేకిస్తున్నారు. వీరికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూ సీ) మద్దతుగా నిలిచింది. 26 ఏళ్లుగా ఇంటింటా చె త్త సేకరిస్తూ బతుకుతున్న తమ ఉపాధికి కొత్త విధానంతో ముప్పు ఏర్పడిందంటున్నారు. అట్‌సోర్సింగ్ కార్మికులుగా అవకాశం కల్పిస్తారని ఆశపడితే తమను కాదని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బల్దియా ఎదుట ధర్నా చేశారు.
ర్యాగ్ పిక్కర్ల సర్దుబాటు
పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న ఏడు డివిజన్లలోని ట్రాలీ డ్రైవర్లను ఇతర వాహనాలు, డివిజన్లకు సర్దుబాటు చేశారు. ర్యాగ్ పిక్కర్లను కూడా ఇతర డివిజన్లకు కేటాయించారు. కొందరు ర్యాగ్ పిక్కర్లు కొత్త విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు బకాయిలు రావాల్సి ఉందని, వాటిని వసూలు చేసుకునేందుకు గడువు ఇవ్వాలని కోరుతుండగా, ఇంకొందరు తాము పనిచేసిన డివిజన్లనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాజెక్ట్‌పై పర్యవేక్షణ
నగరంలో 60 డివిజన్లు ఉండగా, 40కుపైగా డివిజన్లలో పూర్తిస్థాయి, మరికొన్నింటిలో పాక్షికంగా బల్దియా పారిశుధ్య సేవలు అందిస్తోంది. ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌ఎల్ టౌన్‌షిప్, సింగరేణి కాలనీల్లో యాజమాన్యాలే పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశలవారీగా మిగిలిన డివిజన్లలోనూ డ్రైవర్ కం ఆపరేటర్ విధానాన్ని అమలు చేయాలని బల్దియా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇంటింటా చెత్త సేకరణకు డ్రైవర్ కం ఆపరేటర్ పాలసీ
పైలెట్ ప్రాజెక్టుగా నగరంలోని ఏడు డివిజన్లలో అమలు
ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యతిరేకిస్తున్న ర్యాగ్ పిక్కర్లు
రామగుంబం బల్దియా ఎదుట పెద్దఎత్తున కార్మికుల ఆందోళన
పందుల పెంపకందారులకు పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో..
పందుల పెంపకందారులకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తొలుత ఈ విధానం ప్రవేశపెట్టింది. నగరపాలకలపై ఆర్థికభారం తగ్గించడం, చెత్త సేకరణను వందశాతం పూర్తి చేయడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లకూ విస్తరించిందని అధికారులు చెబుతున్నారు. దీనినే రామగుండంలోనూ పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారని వివరించారు.


