జ్యోతినగర్: రాజ్యాధికారమే మాదిగ మహాశక్తి లక్ష్యమని మహాశక్తి కోర్ కమిటీ సభ్యుడు అసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన నియోజకవర్గ మాదిగల ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ ప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసేందుకు అవకా శం కల్పించేందుకు ముందుకు సాగుదామని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొ న్నారు. అనంతరం ప్రముఖులను పలువురు సన్మానించారు. మడిపల్లి మల్లేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంజపురి పులేందర్, కర్రావుల డేవిడ్‌రాజ్, పెద్దెల్లి ప్రకాశ్, న్యాతరి రాయమల్లు, బూడిద మహేందర్, జూల లింగయ్య, విజయ్ కుమార్, పర్లపల్లి బాబు, పుట్ట సదానందం, రాజ్‌గోపాల్, భాగ్యలక్ష్మి, కనకం మహేందర్, కుక్క గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవం కోసం పోరు
పెద్దపల్లి: బీసీల ఆత్మగౌరవమే లక్ష్యంగా పోరు సాగిస్తున్నామని, ఇందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం జిల్లా కేంద్రంలో ప ర్యటిస్తారని బీసీ జేఏసీ జిల్లా చైర్ పర్సన్ దా సరి ఉష తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐక్యత, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు వెల్లడించా రు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మ న్ కొండి సతీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్, నాయకులు బిక్షపతి, కె.రమేశ్, కలవేణి రవి, ఆసరి రాజయ్య, అబ్దుల్ మాలిక్, శ్రావణ్, అజీమ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు పూరిస్తేనే..
పెద్దపల్లి: జిల్లాలో ఎస్‌ఐఆర్(సర్) కార్యక్రమంచురుకుగా కొనసాగుతోంది. ఈనెల 25న ప్రా రంభమైన బీఎల్‌వోల ఇంటింటి సందర్శన ద్వారా ప్రజలను కలుస్తూ ఎన్యూమరేషన్ ఫా మ్స్ అందిస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లో హెల్ప్ డేస్కు లు, టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు.
సామ్రాజ్యవాద విధానాన్ని వ్యతిరేకిద్దాం
గోదావరిఖని: మాట వినడం లేదంటూ ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడుతూ సామ్రాజ్యవాదం విస్తృతం చేస్తున్న అమెరికా వైఖరిని వ్యతిరేకిద్దామని సీపీఎం నేత తుమ్మల రాజారెడ్డి అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని శ్రామికభవన్‌లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. వెనుజులా, క్యూబా, ఇరాన్ తదితర దేశాలపై అమెరికా దాడులు శోచనీయమన్నారు. మనదేశంలో ప్రజలను మతాల వారీగా విభజిస్తూ ఘర్షణలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాయకులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, బిక్షపతి, మెండే శ్రీనివాస్, కొమురయ్య, జ్యోతి, గణేశ్, శైలజ తదితరులు పాల్గొన్నారు.
‘ఎల్టా’ జిల్లా కార్యవర్గం
పెద్దపల్లి: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోయేషన్(ఎ ల్టా) జిల్లా కార్యవర్గం ఆది వారం జిల్లా కేంద్రంలో ఎ న్నికైంది. అధ్యక్షుడిగా గ డ్డం జగదీశ్వర్(రామగుండం), ప్రధాన కార్యదర్శిగా డి.నాగరాజు (జూ లపల్లి), ఉపాధ్యక్షులుగా జె.శ్రీనివాస్, జి.రమే శ్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్.రజనీవందన, సంయుక్త కార్యదర్శులుగా వై.శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.శేషాద్రి, మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇందిర, మీ డియా కో ఆర్డినేటర్‌గా ఎ.కనకయ్య, ఫైనాన్స్ కార్యదర్శిగా బి.లక్ష్మణ్‌ను ఎన్నుకున్నారు. సాధుల వెంకటేశ్వర్లు, కె.సత్యప్రకాశ్‌రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ, ఇంగ్లిష్ భాషాభివృద్ధికి అందరూ తోడ్పడాలన్నారు.


