పోలియో రహిత తెలంగాణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలియో రహిత తెలంగాణే లక్ష్యం

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

పెద్దపల్లి: పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా అర్హులైన చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ముస్కాన్‌ నాజ్‌ నయ్యర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, కౌన్సిలర్‌ కొట్టే స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లలోపు వారికి తప్పనిసరి

కోల్‌సిటీ: ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పో లియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత ని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. వైద్య, ఆ రోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక 51వ డివిజన్‌ అశోక్‌నగర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చే సిన పల్స్‌పోలియో కేంద్రాన్ని డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్యతో కలిసి మేయర్‌ ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులపాటు కొనసాగే పల్స్‌పోలియోను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్‌ ఆకారపు రేఖా– మ హేశ్‌, రామగుండం అర్బన్‌ పోలియో చుక్కల ప్రొ గ్రాం ఇన్‌చార్జి డాక్టర్‌ మణకేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ స్నేహలత, మెప్మా సీవో శ్వేత, ఆర్‌పీలు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement