పెంచిన రుసుం(రూ.లలో)
గోదావరిఖని: కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సింగరేణి ఏరియాల్లో యాజమాన్యం స్విమ్మింగ్‌పూల్స్ నిర్మించింది. వీటిని వినియోగించుకునేందుకు నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తోంది. ప్రస్తుతం నెలవారీ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు, వారిపిల్లలతో పాటు, రిటైర్డ్ కార్మికులు, కార్మికేతరులు, వారిపిల్లపై ఆర్థిక భారం పడుతోంది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం.. స్విమ్మింగ్‌పూల్‌లో ఉచిత సేవలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతున్న ఈ క్రమంలో.. అనూహ్యంగా చార్జీలు పెంచుతూ సీఆర్‌పీ/పీఈఆర్/డబ్యూఈఎల్/స్పోర్ట్స్/2026/2275 పేరిట ఈనెల 24న ఉత్తర్వులు జారీచేసింది. రెట్టింపు చేసిన చార్జీలు జూలై ఒకటో తేదీనుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
నెలవారీ చార్జీలు పెంచిన సింగరేణి కార్మికులు, కార్మికేతరులపై ‘స్విమ్మింగ్‌పూల్’ భారం
ఉద్యోగులు గతం ప్రస్తుతం
సింగరేణి ఉద్యోగులు 100 200
కుటుంబసభ్యులు(15ఏళ్లపైగా) 60 150
కుటుంబసభ్యులు(14ఏళ్లలోపు) 40 100
రిటైర్డ్ ఉద్యోగులు 200 300
కార్మికేతరులు(15ఏళ్లపైగా) 500 1,200
కార్మికేతరులు(15ఏళ్లలోపు) 400 1,000


