రామగుండంలోని ఆస్పత్రి కన్నా గోదావరిఖని ఆస్పత్రి కొంత దగ్గరగా ఉంది. కానీ గర్భిణులు వారికి కేటాయించిన హెల్త్‌సెంటర్‌లోనే పరీక్షలు చేయించుకోవాలి. అంతదూరం వెళ్లడం ఇబ్బందిగా ఉంది. సమస్యను ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్తా.
– వెంగల బాపు, కార్పొరేటర్, రెండో డివిజన్
ప్రజాభిప్రాయాలు పరిశీలిస్తాం
హెల్త్ సెంటర్ తరలింపుపై ప్రజాభిప్రాయాలు పరిశీలిస్తాం. ప్రజాప్రతినిధులు, స్థానికులు మాకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటాం.
– ప్రమోద్‌కుమార్, డీహెచ్‌వో


