ఎలిగేడు: డ్రగ్స్, అబ్యూస్, మత్తు పదార్థాల నిర్మూలన, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర తొలి జాతీ య యువజన అవారు గ్రహీత కొండ రవియాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గౌరవ్ సమ్మన్ అవార్డు, సర్టిఫికెట్‌ను అతిథుల నుంచి అందుకున్నారు. ధూళికట్టకు చెందిన రవియాదవ్ 15ఏళ్లుగా సామాజిక గేయాలు పా డుతూ ప్రజలను చైతన్యపర్చుతున్నారు. ఆ యన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు, ధూళికట్ట గ్రామస్తులు అభినందించారు.
‘సర్’పై అవగాహన
రామగుండం: గ్రామీణ ఓటర్లకు ‘సర్’పై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నామని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ అన్నారు. ముర్మూరు, రాయదండి, బ్రాహ్మణపల్లి, అంతర్గాం తదితర గ్రామాల్లో ‘సర్’పై శనివారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఓటుహక్కు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికీ ఉండదన్నారు. మా జీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, ఓబీసీ సెల్ ప్రతినిధి సింగం కిరణ్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ మగ్గిడి స్వరూప, నాయకులు గొర్రె చందు, మగ్గిడి రాకేశ్, అనుమల్ల రాకేశ్, జూల విజయ్, రవి, బానాల రవి, లంక మదనయ్య తదితరులున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ డివిజన్లలో సర్ పత్రాలు పంపిణీ చేశారు. బీఎల్‌ఓలు మాచర్ల నీరజ, కూకట్ల రమాదేవి, ఆరుముళ్ల సునీత, పల్లికొండ రేవతి, కాంగ్రెస్ శ్రేణులు సాదు రమేశ్, సాదుల శివ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’
జూలపల్లి: పెద్దాపూర్ ఆదర్శ విద్యాలయం విద్యార్థిని ఎస్.సిరివల్లి విద్యాశాఖ, సోషల్ ఫోరం ఇటీవల నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో ప్రథమ బహుమతి సాధించింది. విద్యాశాఖ డైరెక్టర్ .నవీన్ నికోలస్ ఆమెకు ప్రశంసపత్రం అందజేశారు. బాలికతోపాటు తల్లిదండ్రులను డీఈవో శారద, ఎంఈవో సరస్వతి, ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు శనివారం అభినందించారు.
కూరగాయల విత్తనాలు పంపిణీ
జ్యోతినగర్: మేడిపల్లి సెంటర్ లైఫ్ స్కిల్స్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత శనివారం రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస 20 గ్రామాలతోపాటు వివిధ డివిజన్లలోని 200 మంది రైతులకు సీఎస్సార్ ద్వారా రూ.10.30 లక్షల విలువైన కూరగాయల విత్తనాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్) సాగర్ రంజన్ సాహూ, సీఎస్సార్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
4న ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ టెస్ట్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జువాలజీ ఎంట్రెన్స్ గ్రాండ్ టెస్ట్‌ను జూలై 4న ఆన్‌లైన్ పద్ధతిన నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య శనివారం తెలిపారు. ఈ టెస్ట్ ఏటా మాదిరిగానే ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఓ విద్యార్థి రాష్ట్రస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించా డని గుర్తుచేశారు. ఆసక్తి గలవిద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వి ద్యార్థులకు అండగా నిలుస్తున్న జువాలజీ హె చ్‌వోడీ తిరుపతిని ఆయన అభినందించారు.


