సుల్తానాబాద్‌రూరల్/జ్యోతినగర్: బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో విద్యార్థులపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై జిల్లా ఎ స్సీ డెవలప్‌మెంట్ అధికారి ర వీందర్, అధికారులు శనివా రం సుల్తానాబాద్‌లోని నేహా కాన్సెప్ట్ స్కూల్, ఎన్టీపీసీలోని విశ్వభారతి హైస్కూళ్లను సందర్శించారు. ‘బెస్ట్’ స్టూడెంట్లపై వివక్ష శీర్షికన ఈనెల 26న సాక్షిలోనూ ప్రచురితమైన కథనంపై స్పందించారు. విద్యార్థులు, యాజమాన్యాలతో మాట్లాడారు. విద్యార్థులందరికీ పుస్తకాలు అందించాలన్నారు. విశ్వభారతి స్కూల్ యాజమాన్యం బుక్స్, సామగ్రిని అందించనున్నట్లు తెలిపింది.


