కోల్‌సిటీ: ‘ఇది మార్కెటేనా? దుకాణాల ముందు అపరిశుభ్రతకు బాధ్యులెవరు? ఇంత దుర్వాసన వస్తుంటే ఎలా మాంసం విక్రయిస్తున్నారు? ఇలా చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తాం.. మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తాం’అని మేయర్ మహంకాళి స్వామి మాంసం విక్రయదారులను హెచ్చరించారు. 39వ డివిజన్ శివాజీనగర్ కూరగాయల మార్కెట్‌లో ఆయన శనివారం వార్డుబాట నిర్వహించారు. డిప్యూటీ మే యర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ తిప్పారపు మానస హాజరయ్యారు. మాంసం దుకాణాల ఎదు ట అపరిశుభ్రత చూసి వ్యాపారులపై ఆగ్రహం వ్య క్తం చేశారు. పరిశుభ్రత పాటించాలని సూచించా రు. చెత్త, రాళ్లు, ప్లాస్టిక్ కవర్లు, శిథిలాలను తొలగింపజేశారు. మార్కెట్ సమీపంలో 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని మేయర్ సూచించారు.
అల్పాహార సేవకు వెయ్యి రోజులు
కోల్‌సిటీ/గోదావరిఖనిటౌన్: రామగుండం లయ న్స్ క్లబ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ (మీల్స్ ఆన్ వీల్స్) సేవ శనివారంతో వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ ప్రత్యేక కార్యక్రమానికి మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై అ ల్పాహారం పంపిణీ చేశారు. మీల్స్ ఆన్ వీల్స్ కో ఆర్డినేటర్ బంక రామస్వామి, రీజియన్ చైర్‌పర్సన్ కజాంపురం రాజేందర్‌ను శాలువాతో సన్మానించారు. లయన్స్ క్లబ్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి , గోపాలరావు, తిలక్ చక్రవర్తి పాల్గొన్నారు.
మేయర్ మహంకాళి స్వామి ఆగ్రహం


