పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి భవన నిర్మాణంలో వేగం పెంచా లని ప్రభుత్వ విప్ సీహెచ్ విజయరమణారావు సూచించారు. శనివారం ఆయన భవనం పనులు పరిశీలించారు. పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
పథకాల అమలులో ముందంజ
జూలపల్లి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. చీమలపేటలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనం ప్రారంభించారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. సీహెచ్ సుధాకర్‌రావు స్మారక క్రికెట్ టోర్నీలో విజేతలకు జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో విప్ మాట్లాడారు. తహసీల్దార్ దత్తుప్రసాదరావు, సర్పంచ్ లంక స్వామి, ఏఎంసీ చైర్మ న్ కొమ్మ పోచాలు, పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, ఎంపీవో శేషయ్య సూరి, ఏపీవో సదానందం, సర్పంచులు సంపత్‌కుమార్, తొగరు శ్రీనివా స్, నాయకులు నర్సింహయాదవ్, జక్కని శంకర య్య, అంజయ్య, లోక జలపతిరెడ్డి, బండి స్వామి, కొమురయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


