2024 నవంబర్‌లో అప్పటి సీఎండీ బలరాం పీఆర్పీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సీఎండీని కూడా కలిసి సమస్య వివరించాం. సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం, కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులనూ కలిశాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అన్నికార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్లు పరిష్కరించాలని యాజమాన్యానికి లేఖ అందజేశాయి. అయినా పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. పీఆర్పీ కోసం మేం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. – పొనుగోటి శ్రీనివాస్,
ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ


