మంథని: నిత్యం రద్దీగా ఉండే మంథని కూరగాయల మార్కెట్ ఏరియా బోసిపోయి కనిపిస్తోంది. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ప్రస్తుత కట్టడాలు తొలగించారు. ఇక్కడి నుంచి బొక్కలవాగు కట్టపైకి మార్కెట్‌ను తరలించారు.
పడిపోయిన వ్యాపారం.. గదులు ఖాళీ
మార్కెట్ ఏరియా పరిధి.. కేడీసీసీ బ్యాంకు రోడ్డు, రాంరెడ్డి కాంప్లెక్స్ ఏరియాతోపాటు చుట్టూ ఉన్న కూడలిలోని వ్యాపారులకు పదిరోజుల నుంచి వ్యా పారాలు సాగడంలేదు. వ్యాపారాలు లేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఇటువైపు వచ్చేవారు లేక బిజినెస్ పడిపోయింది. కొందరు వ్యాపారులు తమ దుకాణాలను బొక్కలవాగు కట్ట సమీపంలోకి మార్చుతున్నారు. మరికొందరికి సమీపంలో గదు లు అందుబాటులో లేక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. వ్యాపారం పడిపోవడంతో అనేకమంది దుకాణాలు ఖాళీ చేయడంతో సమీపంలో చాలాగదులకు టూ – లెట్ బోర్డులు తగిలించారు. మార్కె ట్ సమీపంలో పక్కాగా నిర్మాణాలు చేసుకున్న యజమానాలు మరోచోటికి మారే అవకాశం లేక అద్దెకు ఇచ్చిన గదులు ఖాళీ అవుతుండడంతో ఆందోళకు గురవుతున్నారు. బ్యాంకు రుణాలు పొంది రూ.లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నామని, గదులు ఖాళీ అయితే ఈఎంఐలు ఎట్లా చెల్లించేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ నిర్మాణం జరిగే వరకు ఎంతకాలం పడుతుందో, అప్పటివరకు తమ పరిస్థితి ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్ ఏరియాలో టూలెట్ బోర్డులో ఓ గది
బోసిపోయిన మార్కెట్ ప్రాంతం
గదులు ఖాళీ.. గిరాకీ లేదు
పడిపోయిన వ్యాపారం
ప్రత్యామ్నాయంలో వ్యాపారులు


