వన మహోత్సవానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి సిద్ధం

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ఈఏడాది 6,57,500 మొ క్కలు నాటాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధానపాత్ర పోషించనుంది. జిల్లాలో గల 263 నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం చేపట్టారు. వాటి సంరక్షణకు 3,421 పని దినాలు, ఈజీఎస్‌ కూలీలకు వేతనం, మెటీరియల్‌ కోసం రూ.1,24,604 ఖర్చు చేశారు. ప్రభుత్వ, అటవీ, ఖాళీ స్థలాలు, రోడ్డుకు ఇరువైపులా, చెరువుగట్లు, కుల సంఘాల స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో గృహాలంకరణ, పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. వీటిని నివాసాల్లో నాటేందుకు సరఫరా చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement